- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ జాగ్రఫీ: అడవులు(TSPSC: పోటీ పరీక్షల ప్రత్యేకం)
తెలంగాణ రాష్ట్రం మొత్తం 26,969.54 చ. కి.మీ అటవీ విస్తీర్ణంను కలిగి ఉంది.
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 24.05 శాతంగా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో అటవీ ప్రాంతం..?
1. ఓపెన్ ఫారెస్ట్ అడవులు (31.5 %) 8,484 చ.కి.మీ
2. మధ్యస్థ దట్టమైన అడవులు (29.3 %) 7,896 చ.కి.మీ
3. చిట్టడవులు (16.4 %) 4,420 చ.కి.మీ
4. దట్టమైన అడవులు (1.1%) 286 చ.కి.మీ
5. నీటి వనరులు (0.6 %) 157 చ.కి.మీ
అడవుల రకాలు, సమూహాలు:
తెలంగాణలోని అడవులను మూడు గ్రూపులు గా వర్గీకరించారు. అవి 1. ఉష్టమండల పొడి ఆకురాల్చే అడవులు, 2. ముళ్లతో కూడిన పొద అడవులు, 3. ఉష్ణమండల తేమ ఆకురాల్చే అడవులు.
ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు: ఇవి తొమ్మిది రకాలుగా ఉంటాయి.
1. దక్షిణ పొడి మిశ్రమ ఆకురాల్చే అడవులు
2. పొడి ఆకురాల్చే చిట్టడవులు
3. పొడి వేడి అడవులు
4. ద్వితీయ పొడి ఆకురాల్చే అడవులు
5. పొడి వెదురు
6. హార్డికీయ అడవులు
7. బొస్లెల్లియ అడవులు
8. పొడి సవన్నా అడవులు
9. పొడి గడ్డి భూములు
ఉష్ణమండల ముళ్ల అడవులు:
1. దక్షిణ థార్న్ స్క్రబ్స్
2. దక్షిణ ముళ్ల అడవులు
ఉష్ణమండల తేమ ఆకు రాల్చు
1. దక్షిణ తేమ మిశ్రమ ఆకురాల్చే అడవులు
అటవిశాఖ ప్రకారం అడవులు ఆరు రకాలు:
1. చాలా దట్టమైన అడవులు
2. మధ్యస్థ అడవులు
3. బహిరంగ అడవులు
4. చిట్టడవులు
5. నాన్ ఫారెస్ట్
6. నీటి వనరులు
తెలంగాణ రాష్ట్రం మధ్య దక్కన్ పీఠభూమిలో ఉంది.
దేశ అడవుల్లో తెలంగాణ రాష్ట్రం 12వ స్థానంలో ఉంది.
లీగల్ స్టేటస్ కిందికి వచ్చే అడవులు 1. రిజర్వుడు అడవులు, 2. రక్షిత అడవులు
అటవీ చట్టం 1988 ప్రకారం, రిజర్వుడు అడవులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షిస్తాయి.
రక్షిత అడవులు అనగా వేటాడటం నుంచి సంరక్షణ పొందే అడవులు.
తెలంగాణలో వెజిటేషన్ రకం అడవులు. అవి 1. హార్డికీయ అడవులు 2. బోస్వెల్లియ అడవులు 3. ఆల్‌బిజియామర.
కవ్వాల్ టైగర్ రిజర్వ్..
గతంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది. ఇప్పుడు మంచిర్యాల నిర్మల్ జిల్లాలో ఉంది.
ఇది 1999లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా గుర్తింపు లభించగా.. 2012లో టైగర్ రిజర్వుగా గుర్తింపు పొందింది.
కవ్వాల్‌ను 1965లో గుర్తించారు. తెలంగాణలో పురాతన టైగర రిజర్వ్‌గా గుర్తింపు పొందింది.
ఇది కడెం, గోదావరి నది ఒడ్డున ఉంది. బైసన్‌లు కూడా ఈ కవ్వాలో ఉన్నాయి.
ఈ టైగర్ రిజర్వ్ ఎక్స్‌టెన్షనే మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వు.
ఇది జన్నారం మండలం, మంచిర్యాల జిల్లాలో ఉంది.
ప్రశ్న: కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉన్న జిల్లా ?(4)
1.ఆదిలాబాద్ 2. మంచిర్యాల 3.ఆదిలాబాద్, మంచిర్యాల 4. మంచిర్యాల, నిర్మల్
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
1978లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా గుర్తింపు పొందింది.
1983లో టైగర్ రిజర్వ్‌గా మారింది.
గతంలో మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో ఉండేది. ఇప్పుడు నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలో ఉంది.
ఈ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో నివసించే ముఖ్యమైన తెగలు చెంచులు, లంబాడాలు
చెంచుతెగలు ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్నారు.
లంబాడ తెగలు నల్గొండ జిల్లాలో ఉన్నారు.
ఈ టైగర్ రిజర్వ్ ఎక్సెటెన్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
గతంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉండేవారు. ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో ఉన్నారు. ఇక్కడ ఉండే తెగ పేరు నాయక్ పోడులు.
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
సంరక్షణ కేంద్రం జిల్లా
కవ్వాల్ టైగర్ రిజర్వ్ మంచిర్యాల, నిర్మల్
ప్రాణహిత మంచిర్యాల
సివ్వారం మంచిర్యాల
ఏటూరునాగారం ములుగు
పాకాల వరంగల్
కిన్నెరసాని భద్రాద్రి కొత్తగూడెం
మంజీర సంగారెడ్డి
పోచారం మెదక్
అమ్రబాద్ టైగర్ రిజర్వ్ నాగర్ కర్నూల్, నల్గొండ
అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లాలు
స్థానం జిల్లా విస్తీర్ణం
1 భద్రాద్రి కొత్తగూడెం 15.98%
2 ములుగు 10.89%
3 నాగర్ కర్నూల్ 9.25 %
- పృథ్వీ కుమార్ చౌహన్
డైరెక్టర్, పృథ్వీస్ ఐఎఎస్ స్టడీ సర్కిల్.