- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ హిస్టరీ: యూరోపియన్ల రాక (గ్రూప్స్, ఎస్ఐ/కానిస్టేబుల్, జేఎల్ స్పెషల్)
యూరోపియన్లు ప్రధానంగా సుగంధ ద్రవ్యాలు, సిల్క్ కోసం భారతదేశంతో వర్తకం చేశారు.
వీరు వర్తకం కోసం 3 రవాణా మార్గాలను ఉపయోగించేవారు. అవి
1) యూరప్-కాన్‌స్టాంట్‌నోపుల్ (టర్కీలోని ఇస్తాంబుల్) -మధ్య ఆసియా-భారత్
2) యూరప్-మద్యధరా సముద్రం - పశ్చిమ ఆసియా - మధ్య ఆసియా - భారత్
3) యూరప్-మద్యధరా సముద్రం-ఆఫ్రికా-ఎర్ర సముద్రం- పశ్చిమ ఆసియా - మధ్య ఆసియా - భారత్
పై 3 మార్గాలలో మొదటి మార్గం అతి ముఖ్యమైనది.
స్పెయిన్ రాజు బిరుదు .. హెన్రీ ది నావిగేటర్:
1453లో టర్కీ రాజు రెండవ మహమ్మద్ కాన్‌స్టాంట్ నోపుల్‌ను ఆక్రమించి ఈ మార్గం గుండా యూరోపియన్లు భారతదేశంతో లేదా తూర్పు దేశాలతో వర్తకం చేయకూడదని ఆంక్షలు విధించాడు.
దీనితో భారతదేశంతో నేరుగా ఒక సముద్ర మార్గమును కనుగొనుటకు యూరోపియన్లు నిర్ణయించారు.
యూరప్‌లో సముద్రయానం నౌకాయానం ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి -స్పెయిన్ రాజు హెన్రీ.
స్పెయిన్ రాజు హెన్రీకి 'హెన్రీ ద నేవిగేటర్' అనే బిరుదు కూడా ఉంది.
హెన్రీ జీబ్రాల్టర్ జలసంధిని దాటి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో చేరుకొని తిరిగి సురక్షితముగా స్పెయిన్‌కు చేరుకున్నాడు.
నావికుల శిక్షణ కొరకు అనేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశాడు.
కేప్ ఆఫ్ గుడ్ హోప్ పేరు ఎలా వచ్చిందంటే..?
1485 బార్తిలోమియు డయాజ్ భారతదేశంతో ఒక సముద్ర మార్గమును కనుగొనుటకు బయలుదేరి ఆఫ్రికా దక్షిణ ప్రాంతమునకు చేరుకున్నాడు.
అక్కడి వాతావరణం సరిగా లేకపోవడంతో తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాడు. తిరిగి యూరప్‌కు పయనిస్తూ ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి తుపానుల అగాధం (Cape of Storm) అని పేరు పెట్టాడు.
తుఫానుల అగాధం భారతదేశంతో ఒక సముద్ర మార్గం కనుగొనడంలో ప్రోత్సాహకరంగా ఉండాలని భావించి రెండవ జాన్ దీనికి 'కేప్ ఆఫ్ గుడ్‌హోప్' అని పేరు పెట్టాడు.
కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనుటకు బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంలో తన దిశ మారి కరేబియన్ దీవులకు చేరుకున్నాడు. ఈ దీవులకు వెస్టిండీస్ అని పేరు పెట్టాడు.
పోర్చుగల్ రాజు ఇమాన్యువల్-2 భారతదేశంతో నముద్ర మార్గం కనుగొనుటకై వాస్కోడ గామాను ప్రోత్సహించాడు.
వాస్కోడ గామా భారతదేశంతో సముద్ర మార్గమును కనుగొనుటకు పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుండి బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్‌హోప్‌కు చేరుకున్నాడు.
1498లో కేప్ ఆఫ్ గుడ్‌హోప్ వద్ద వాస్కోడ గామా అబ్దుల్ నాజిబ్ అనే వర్తకుడిని కలిసి అతని సహాయంతో మే 17న కాలికట్ చేరుకున్నాడు.
కాలికట్‌కు చేరుకున్న మూడు నౌకలు ఇవే:
1. Sao Gabriel-వాస్కోడగామ
2. Sao Rafael-పౌలోడగామ
3. Caravel Berrio-నికోలవ్ కోయిల్హో
భారతదేశాన్ని సందర్శించిన తొలి యూరోపియన్.. వాస్కోడ గామా:
కాలికట్ రాజు జామోరిన్, వాస్కోడ గామాకు స్వాగతం పలికి అతనికి కావలసిన వస్తువులను కొనిపించి తిరిగి యూరప్‌కు పంపాడు.
యూరవ్‌లో ఈ వన్తువులను అమ్మిన తర్వాత వాస్కోడ గామాకు తన పెట్టుబడిపై 60 రెట్లు లాభం వచ్చింది.
దీని తర్వాత పోర్చుగీసు వారు ఒక శతాబ్ద కాలం పాటు భారతదేశ వర్తకాన్ని శాసించారు.
రెండవసారి వాస్కోడ గామా 1502 అక్టోబర్ 30న భారతదేశానికి వచ్చాడు.
1524 డిసెంబర్ 24న మలేరియాతో కొచ్చిలో మరణించాడు.