- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బస్సు కోసం విద్యార్థుల రాస్తారోకో
దిశ,గద్వాల : బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు నిరసనకు దిగారు. గ్రామాల నుంచి గద్వాల్ నగరానికి చేరుకోవడానికి సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందులకు గురిఅవుతున్నామంటూ విద్యార్థులు గురువారం థరూర్ మండల కేంద్రం లోని పెట్రోల్ బంక్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఉదయం గ్రామాల నుంచి జిల్లా కేంద్రంలో గల కళాశాలకు చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని, గట్టు నుంచి గద్వాల్ కు ఒకే బస్ ఉండడంతో చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని మరొక బస్ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు తెలిపారు. అదే మార్గంలో వెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఆర్టీసీ డీఎంకు ఫోన్ చేసి గ్రామాలలో బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.