ప్రాణం తీసిన ఈత సరదా

by Sridhar Babu |   ( Updated:2020-08-24 08:15:27.0  )
ప్రాణం తీసిన ఈత సరదా
X

దిశ, వెబ్‌డెస్క్: స్నేహితులతో కలిసి బావిలో ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన ఇనుగంటి గోపిచంద్ (17) తన స్నేహితులతో గ్రామంలోని బావిలో ఈతకు వెళ్లారు. ఈత అయిపోయాక అందరూ బయటకు రాగా, గోపిచంద్ రాలేదు, దీంతో స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు.

దీంతో గ్రామస్తులు వెంటనే స్థానిక అధికారులకు సమాచారం చేరవేశారు. అనంతరం వెంటనే అప్రమత్తమైన అధికారులు బావిలో నుంచి నీటిని మోటర్ల ద్వారా బయటకు తీసి, గోపిచంద్ మృత దేహాన్నిబయటికి తీశారు. కాగా, గోపీచంద్ పాల్వంచ సాంఘిక గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు సీఐ నాగరాజు ఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజేశ్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed