బంగారు కమ్మలు కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య

by Sumithra |   ( Updated:2021-01-19 06:18:15.0  )
బంగారు కమ్మలు కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, కామారెడ్డి: తల్లిదండ్రులు బంగారు చెవి కమ్మలు కొనివ్వడం లేదని పదో తరగతి చదువుతున్న బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే…అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన బీరయ్య, బీరవ్వ దంపతులకు ఒక కుమారుడు శ్యామ్, కుమార్తెలు సౌందర్య, పూజితలు ఉన్నారు. బీరయ్య దపంతులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చిన్న కుమార్తె పూజిత గ్రామంలో పదోతరగతి చదువుకుంటోంది.

గత కొంతకాలంగా తనకు బంగారు కమ్మలు కొనివ్వాలని తరుచు తల్లిదండ్రులను పూజిత అడిగేది. డబ్బులు లేకపోవడంతో బంగారు కమ్మలు తర్వాత కొనిస్తానని తల్లిదండ్రులు పూజితకు నచ్చజెప్పారు. తల్లిదండ్రులు, అక్క సౌందర్యలు పని నిమిత్తం కామారెడ్డికి సోమవారం వెళ్లారు. ఒంటరిగా ఉన్న పూజిత బంగారు కమ్మలు కొనివ్వడం లేదని మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి పూజిత ఫ్యాన్ కు ఉరివేసుకుని ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story