సడక్ బంద్.. రహదారులు దిగ్బంధం

by Sridhar Babu |
సడక్ బంద్.. రహదారులు దిగ్బంధం
X

దిశ, మణుగూరు: ఆదివాసీలు 40 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని నియోజకవర్గ అఖిలపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నియోజకవర్గంలో అఖిలపక్ష పార్టీ నాయకుల ఆధ్వర్యంలో “సడక్ బంద్” నిర్వహించి ధర్నా, రాస్తారోకో చేసి రహదారులను దిగ్బంధం చేశారు. ఈసందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ….అసెంబ్లీ సాక్షిగా పోడు భూములకు పట్టాలు ఇస్తానని, అటవీ అధికారుల దాడులు నిలిపివేస్తామని, రైతులపై అక్రమకేసులు కొట్టివేస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు మాట మార్చారన్నారు. ఆదివాసీల గిరిజనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు. పొడుభూములు సాగుచేసుకుంటున్న గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయడం సరికాదన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీలో గిరిజనుల మనుగడ లేకుండా చేస్తున్నాయని ,గిరిజనులకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed