విజయనగరంలో వింత ఘటన.. దేవత కలలో చెప్పిందంటూ..

by srinivas |
విజయనగరంలో వింత ఘటన.. దేవత కలలో చెప్పిందంటూ..
X

దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా వింత ఘటన చోటు చేసుకుంది. “రాజులమ్మ తల్లి కలలో కనిపించి.. మీ భూముల్లో నేను విగ్రహాల రూపంలో ఉన్నాను.. తవ్వకాలు జరిపితే విగ్రహాలు లభ్యమవుతాయని చెప్పిందంటూ” పుర్రేయవలస గ్రామానికి చెందిన కంది లక్ష్మి తవ్వకాలకు పూనుకున్నారు. గ్రామానికి సమీపంలోని చీపురుపల్లి-సుభద్రాపురం ప్రధాన రహదారి పక్కన 25 రోజులుగా తవ్వకాలు చేపట్టింది. కలలో రాజులమ్మవారు చెప్పిన ప్రాంతంలో తవ్వకాలు చేస్తూనే ఉంది. తవ్వకాల కోసం ఇప్పటి వరకు రూ.లక్షా 50వేలు ఖర్చుచేశారు. పొలంలో సుమారు 32 అడుగుల లోతు తవ్వినా ఎక్కడా విగ్రహం లభించలేదు.

దీనికి ఆర్థిక భారం తోడవ్వడంతో తవ్వకాలు మధ్యలో ఆపేశారు. అమ్మవారు కలలో కనిపించి మరో 50 అడుగుల లోతు తవ్వితే విగ్రహాలు కనిపిస్తాయని చెప్పడంతో మళ్లీ తవ్వకాలు ప్రారంభించినట్టు లక్ష్మితోపాటు కుటుంబ సభ్యులు తెలిపారు. విగ్రహాలు లభిస్తే ఇళ్లు, భూమి అమ్మేసైనా సరే గుడి కడతామని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు తవ్వినా ఎక్కడా విగ్రహం కనిపించకపోవటంతో గ్రామస్తులంతా ఇదంతా మూఢనమ్మకం..ఇకనైనా తవ్వాకాలు మానేయమని చెబుతున్నారు. అయినా వినకుండా తవ్వకాలను కొనసాగిస్తానంటోంది లక్ష్మి. తవ్వకాలు చూసేందుకు ప్రతిరోజూ జనం క్యూ కడుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed