- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజస్థాన్ లో వింత ఘటన.. ఒంటె తలతో ఆవు పాలిస్తుందట
దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ పెరిగిపోతోంది. మానవుడు తన మేధస్సునుపయోగించి ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. అయినా ఈ కంప్యూటర్ యుగంలో కూడా ప్రజలను మూఢనమ్మకాలనేవి వదలడం లేదు. మూఢనమ్మకాల ఊబిలో చిక్కుకుని ఎంతో మంది ప్రాణాలను వదిలేశారు. మూఢనమ్మకాల వలన ఇప్పుడు జంతువుల ప్రాణాలు కూడా తీస్తున్నారు. తాజాగా మూఢనమ్మకాల మాయలో పడి ఓ రైతు ఎన్నో రోజుల నుంచి పెంచుకుంటున్న ఒంటె తల నరికేసిన ఘటన రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్లితే.. గోవర్ధన్ విలాస్ ప్రాంతంలో రాజేష్ అహిర్ అనే వ్యక్తి చాలా ఆవులున్నాయి. దీంతో అతను డెయరీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో తన అన్ని ఆవులలో ఎక్కువగా పాలు ఇచ్చే ఓ ఆవు అనారోగ్యంతో పాలు ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందాడు. దీంతో రాజేష్ అతని మిత్రుడికి ఎక్కువ పాలు ఇచ్చే నా ఆవు పాలు ఇవ్వడం లేదని చెప్పడంతో అతను ఆవుపాలు ఇవ్వాలంటే దానికి మంత్ర విద్యతోనే సాధ్యం అవుతుందని చెప్పాడు. దీంతో వారిద్దరూ కలసి తన పక్క ఊరిలో ఉన్న ఓ మాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లాడు. దీంతో రాజేష్ మొత్తం విషయాన్ని మాంత్రికుడికి వివరించాడు. విషయం విన్న అతను ఓ ఒంటె తల నరికేసి దానిని ఇంటి ముందు పాతి పెడితే సమస్య పరిష్కారం అవుతుందని నీ ఆవు ఎక్కువపాలు ఇస్తుందని చెప్పాడు. దీంతో రాజేష్ ఏ మాత్రం ఆలోచించకుండా తన మిత్రులతో కలసి ఒంటె మెడను నరికి ఇంటి ముందు పాతిపెట్టాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసునమోదు చేసుకుని నిందుతున్ని అదుపులోకి తీసుకున్నారు.