- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలి- భువనగిరి ఎంపీ
దిశ, భువనగిరి: నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి త్వరగా పూర్తిచేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కోరారు. మంగళవారం రాష్ట్రనీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్, ఈఎన్‌సీ మురళీధర్ లతో బీఆర్‌కె భవన్ లో భేటీ అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న బ్రహ్మణ వెల్లంల, కృష్ణా నది వ్యవహారం, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పెండింగ్ ప్రాజెక్టు పనులపై వారితో చర్చించారు.
బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తి కాగా, నిధుల లేమితో మిగతా సగం నిలిచి పోయాయని మరో రూ. 100 కోట్లు కేటాయిస్తే పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చి లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండలేదని తెలిపారు. కాంగ్రెస్ హయంలో పదేళ్ల క్రితం 70శాతం పనులు పూర్తయిన శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పనులను త్వరగా పూర్తిచేయాలని కోరారు. ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడంతోనే ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.తన విన్నపానికి స్పందించిన నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్ మీ సమస్యను సీఎం దృష్టికి తీసుకుకెళ్లి మిగిలిన ప్రాజెక్టు పనులు డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.