- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశానికే అన్నదాతగా తెలంగాణ రాష్ట్రం: సబితా ఇంద్రారెడ్డి
దిశ, రంగారెడ్డి: ప్రత్యేక తెలంగాణ సాధనతోనే రాష్ట్ర రైతు నేడు దేశానికే అన్నం పెట్టె స్థాయికి ఎదిగాడని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆమె ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఎఫ్ సీఐ ద్వారా 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరిస్తే అందులో 56 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రైతుల నుంచి సేకరించినవేనని, ఈ ఘనత సాధించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతని అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కేవలం మూడేళ్ళలోనే నిర్మించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ముఖ్యమంత్రి నేతృత్వంలో రంగారెడ్డి జిల్లాకు సాగు నీరందించే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా త్వరలోనే పూర్తవుతుందని ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశానికే ఆదర్శనీయంగా నిలిచిందని గుర్తుచేశారు. రెప్పపాటు కూడా విద్యుత్ పోకుండా 24 గంటలపాటు కరెంట్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదని పేర్కొన్నారు. ప్రభుత్వ పధకాలు, కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు మరింత సమన్వయముతో పనిచేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితా హరినాధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, అదనపు కలెక్టర్లు హరీష్, ప్రతీక్ జైన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.