ఏపీలో ఉపద్రవాల హెచ్చరికల వ్యవస్థ ఆరంభం

by srinivas |
ఏపీలో ఉపద్రవాల హెచ్చరికల వ్యవస్థ ఆరంభం
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ప్రకృతి వైపరీత్యాలు ఉపద్రవాలు ముందస్తు హెచ్చరికల వ్యవస్థను రాష్ట్ర హోమ్, డిజాస్టర్ నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. కుంచనపల్లిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయం లో మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హుదూద్, తిత్లీ తుపానుల వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసని అన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నష్టనివారణ చేయలేకపోయామని ఆమె తెలిపారు. అయితే దాని తీవ్రతను తగ్గించగలిగామని.. ఇప్పుడు ఏర్పాటు చేసిన కేంద్రం వల్ల దానిని మరింత తగ్గించగలమని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, ఈ కార్యక్రమంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రిన్సిపాల్ కార్యదర్శి ఉషారాణి, ఏపీఎస్‌డిఎంఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story