- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
7 ఛానల్స్ లో డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రసారం..
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ నిర్వహిస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ప్రసారం చేయనున్నది. ఐసీసీ ఈవెంట్ల ప్రసార హక్కుదారు స్టార్ స్పోర్ట్స్ కావడంతో ఆ మ్యాచ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మ్యాచ్‌ను 7 ఛానల్స్‌లో లైవ్ ప్రసారం చేయనున్నట్లు డిస్నీ ఇండియా వెల్లడించింది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోని ఛానల్స్‌లో ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కామెంట్రీ ఉంటుందని బ్రాడ్‌కాస్టర్ తెలిపింది. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ్, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడలో లైవ్ టెలికాస్ట్‌తో పాటు డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉండనున్నది. ఐపీఎల్ ప్రసారాల మాదిరిగానే ప్రాంతీయ భాషల కామెంటేటర్లు ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ ప్రధాన కార్యాలయం నుంచి పని చేయనున్నట్లు తెలుస్తున్నది. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌లోని హాంప్‌షైర్ బౌల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనున్నది.