ఆడిన మ్యాచ్‌లకే డబ్బులు చెల్లించండి : స్టార్ ఇండియా

by Shiva |
ఆడిన మ్యాచ్‌లకే డబ్బులు చెల్లించండి : స్టార్ ఇండియా
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ వాయిదా పడటంతో బీసీసీఐతో పాటు స్టార్ స్పోర్ట్స్, దానికి యాడ్స్ ఇచ్చిన సంస్థలు కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తమ ప్రకటనకర్తలు, భాగస్వామ్యులకు స్టార్ ఇండియా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఐపీఎల్ సీజన్ 2021లో జరిగిన 29 మ్యాచ్‌లకు మాత్రమే ఇప్పుడు డబ్బులు చెల్లిస్తే సరిపోతుందని చెప్పింది. మిగిలిన డబ్బులు ఐపీఎల్ ఎప్పుడు పూర్తియితే అప్పుడు చెల్లించవచ్చని అన్నది. కాగా 2018 నుంచి 2022 వరకు ఐదేళ్లకు గాను స్టార్ స్పోర్ట్స్ రూ. 16,348 కోట్లకు టెలివిజన్, డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్నది.

ఒక్కో మ్యాచ్‌కు స్టార్ గ్రూప్ రూ. 54.5 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తున్నది. ఆ మేరకు స్పాన్సర్లు, ప్రకటనకర్తల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నది. ఇప్పుడు అర్దాంతరంగా ఐపీఎల్ వాయిదా పడటంతో జరిగిన మ్యాచ్‌లకే డబ్బులు చెల్లించవచ్చని స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఏడాది ప్రేక్షకులను స్టేడియంలలోకి అనుమతించకపోవడంతో పాటు ఇంటి వద్ద పని చేసే వారి సంఖ్య పెరగడంతో వీక్షకుల సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు తెలిపింది. గత సీజన్‌లో 349 మిలియన్ మంది వీక్షించగా.. ఈ సారి 352 మిలియన్లకు చేరినట్లు చెప్పింది.

Advertisement

Next Story