వేలంలో రూ. 233 కోట్లు పలికిన ‘డైనో స్కెలిటన్’

by Sujitha Rachapalli |
వేలంలో రూ. 233 కోట్లు పలికిన ‘డైనో స్కెలిటన్’
X

దిశ, వెబ్‌డెస్క్ : పికాసో గీసిన చిత్రాలు లేదా మోనాలీసా వంటి అద్భుత పెయింటింగ్స్‌కు వేల కోట్ల రూపాయల ధర పలకడం తెలిసిందే. కానీ, ఓ డైనోసర్ స్కెలిటన్‌ ఏకంగా రూ. 233 కోట్లకు అమ్ముడుపోయింది. క్రెటాషియస్ పీరియడ్ (145.5 అండ్ 65.5 మిలియన్ సంవత్సరాల క్రితం)కు చెందిన టైరన్నోసారస్ రెక్స్ అనే డైనోసర్ స్కెలిటన్‌ను ఆక్షన్ హౌజ్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్, గ్లోబ్స్ అండ్ నేచురల్ హిస్టరీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో వేలం వేశారు. లండన్, న్యూయార్క్‌కు చెందిన కస్టమర్లు.. టెలిఫోన్ ద్వారా వేలంలో పార్టిసిపేట్ చేశారు. 3 మిలియన్ల డాలర్లతో మొదలైన ఈ డైనో స్కెలిటన్ ధర పెరుగుతూ.. పెరుగుతూ.. 31.8 మిలియన్ల డాలర్లకు అమ్ముడుపోయింది. అయితే దీన్ని కొనుగోలు చేసిన వారి వివరాలు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.

టైరన్నోసారస్ రెక్స్ అనే ఈ డైనోసర్‌ను స్టాన్ అనే నిక్‌నేమ్‌తో పిలుస్తారు. స్టాన్ లాంటి అరుదైన డైనోసార్ శిలాజాలు దొరకడం చాలా అరుదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇది 13 అడుగుల ఎత్తు, 40 అడుగుల పొడవు ఉంది. ఇది జీవించి ఉన్న సమయంలో.. దాదాపుగా 8 టన్నుల బరువు ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే ప్రస్తుత ఆఫ్రికన్ ఎలిఫెంట్ బరువు కన్నా రెండింతలు ఎక్కువ.

Advertisement

Next Story