శ్రీశైలం ఘటన: వెలుగులోకి కీలక విషయాలు

by Anukaran |
శ్రీశైలం ఘటన: వెలుగులోకి కీలక విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంపై సీఐడీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో సీఐడీ పలు మార్పులు చేసింది. కేసును ప్రభావితం చేసే కీలక విషయాలను గుర్తించి, ఎఫ్ఐఆర్ లో పలు సెక్షన్లను అదనంగా చేర్చింది. సిబ్బంది నిర్లక్ష్యం, నిర్వహణ, లోపాలపై ఫోకస్ చేస్తూ సీఐడీ దర్యాప్తు కొనసాగింది. అగ్నిప్రమాద యంత్రాలు, స్పెషల్ రెస్క్యూ టీమ్ లేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని సీఐడీ పేర్కొంది. ప్రమాద సమయంలో సరైన రక్షణ చర్యలు తీసుకుని ఉంటే ప్రమాద తీవ్రత తగ్గి ఉండేదని తెలిపింది.

Advertisement

Next Story