నారా రోహిత్ స్నేహితుడు కావడం అదృష్టం : శ్రీ విష్ణు

by Shyam |
నారా రోహిత్ స్నేహితుడు కావడం అదృష్టం : శ్రీ విష్ణు
X

శ్రీ విష్ణు… టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి నుంచి వైవిధ్యమైన పాత్రలు ఎంచుకున్న శ్రీ విష్ణు… నారా రోహిత్ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు. తను ఎక్కడ ఉన్నా నాకు కాల్ చేస్తాడని… నేను చేయకపోయినా తను మాత్రం గుర్తుంచుకుని మరీ… ఫోన్ చేస్తాడని తెలిపాడు. విదేశాలకు వెళ్లినా మా ఫ్యామిలీ గురించి ఆలోచించి… మా కోసం కూడా షాపింగ్ చేయడం గొప్ప విషయమని… అలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నా అదృష్టమని తెలిపాడు శ్రీ విష్ణు.

ఇక సినిమాల విషయానికి వస్తే … ప్రేక్షకులు నన్ను ఎలా చూడడానికి ఇష్టపడతారో తెలుసని … అలాంటి పాత్రలే ఎంచుకున్నాను అని తెలిపాడు. కొత్త డైరెక్టర్లతో పని చేస్తూ త్వరగా కలిసిపోతానని… అందుకే న్యూ డైరెక్టర్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పారు శ్రీ విష్ణు. ప్రస్తుతం రాజ రాజ చోళ సినిమా చేస్తున్న శ్రీ విష్ణు… ఫస్ట్ లుక్ తోనే బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేశాడు.

Tags: Sri Vishnu, Nara Rohith, Raja Raja Chola, Tollywood

Advertisement

Next Story