- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాకేష్ మాస్టర్‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
శ్రీరెడ్డి.. తెలుగు సినీ ప్రముఖులకు తలనొప్పి. ఆరోపణలకు అడ్రస్…వివాదాలకు మారు పేరు. టాలీవుడ్లో దాదాపు అందరినీ కార్నర్ చేసింది. అయినా ఆరోపణలు ఎదుర్కొన్న ఏ ఒక్కరూ శ్రీరెడ్డితో ఫైట్ చేయలేకపోయారు.ఎవరి పని వారు చేసుకున్నారు. ఇండస్ట్రీలో క్యారెక్టర్స్ ఇప్పిస్తామని నన్ను మోసం చేశారనీ, చాలా మంది ఆడపిల్లలు ఇలాగే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని.. వారికి న్యాయం చేయాలంటూ ఫిల్మ్ చాంబర్ ఎదుట అప్పట్లో శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసింది. పవన్ కళ్యాణ్, నాని లాంటి స్టార్ హీరోస్ నుంచి కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ వరకు కొందరిపై ఆరోపణలు చేశారు. రాకేష్ మాస్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని శ్రీరెడ్డి ఆరోపిస్తే, తాను మాత్రం శ్రీ రెడ్డిని బిడ్డలాగే చూశానని రాకేష్ మాస్టర్ బదులిచ్చారు. అర్ధనగ్నంగా రోడ్డు మీద ఆందోళన చేస్తే ఏమైందమ్మా అని ఇంటికి పిలిచి భోజనం పెట్టాననీ, అలాంటి తనపై ఇలాంటి నిందలు మోపుతుందా అని రాకేష్ మాస్టర్ శ్రీరెడ్డిపై మండిపడ్డాడు. సంగతి తేలుస్తా అంటూ సవాల్ విసిరాడు. రాకేష్ మాస్టర్ స్పందనపై వెంటనే కౌంటర్ ఇచ్చింది శ్రీరెడ్డి. ‘నిన్ను చూస్తే జాలేస్తోందనీ, నేను తిట్లు మొదలెడితే నీ తాత ముత్తాతలు వచ్చి సారీ చెప్తారని… పబ్లిసిటీ క్రేజ్ ఉన్న వ్యక్తివి’ అంటూ అసభ్యకరమైన పదజాలంతో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. మరి దీనిపై రాకేష్ మాస్టర్ ఏం అంటాడో చూడాలి.