- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సుమ కుటుంబంలో మరో విషాదం..
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ యాంకర్ సుమ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఏడాది వ్యవధిలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న రాజీవ్ కనకాల…ఇప్పుడు సోదరి శ్రీలక్ష్మి కన్నుమూయడంతో కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న శ్రీలక్ష్మి … ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె భర్త సీనియర్ జర్నలిస్ట్ పెద్ది రామారావు కాగా… ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రముఖ నటులు, దర్శకులు దేవదాసు కుమార్తె అయిన శ్రీలక్ష్మి కూడా పలు సీరియళ్లలో నటించారు.
కాగా సుమ అత్తగారు లక్ష్మీదేవి 2018 ఫిబ్రవరిలో మరణించగా… ఆమె మరణాన్ని తట్టుకోలేని దేవదాసు కనకాల 2019 ఆగష్టులో కన్నుమూశారు. ఏడాది తిరగకుండానే వీరిద్దరి కూతురు శ్రీలక్ష్మి చనిపోవడంతో కుటుంబ సభ్యులు కుంగిపోతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత్యక్రియలకు హాజరై.. ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోరాదని కోరారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితిని అర్ధం చేసుకుని మీరు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా శ్రీలక్ష్మి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
Tags: Sri Laxmi Kanakala, Suma, Anchor Suma