- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జెర్సీ’ మూవీ నుంచి శ్రీశాంత్ ఎమోషనల్ పోస్ట్.. నా పరిస్థితి ఇలాగే ఉందంటూ..
దిశ, సినిమా: భారత క్రికెట్ జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగిన కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్.. ఇండియా సాధించిన రెండు ప్రపంచకప్‌లలో తనవంతు పాత్ర పోషించి ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తన పేరు లిఖించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఐపీఎల్ సీజన్ 6లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో జైలు జీవితం గడిపాడు. ఈ నేరం చేసినందుకు 2013 సెప్టెంబరు 13న బీసీసీఐ జీవిత కాలం వేటు వేయడంతో కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడింది. ఇక ప్రస్తుతం తాను మళ్లీ ఇండియా తరఫున ఆడాలనుకుంటున్నట్లు చాలాసార్లు బీసీసీఐకి విన్నవించుకున్న శ్రీశాంత్.. కేరళ జట్టుతో కలిసి మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టగా 9ఏళ్ల తర్వాత రంజీల్లోకి అడుగుపెట్టాడు.
ఈ క్రమంలోనే తన కెరీర్ పట్టాలెక్కించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్న శ్రీశాంత్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. తెలుగు సినిమా ‘జెర్సీ’లో క్రికెటర్ అయిన నాని తన లైఫ్‌లో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని.. మళ్లీ జట్టుకు ఎంపిక అవుతాడు. ఆ సందర్భంగా తన సక్సెస్‌ను ఎక్స్‌ప్రెస్ చేసేందుకు రైల్వే స్టేషన్‌లోకి వెళ్లి ట్రైన్ వెళుతుంటే ఆ శబ్ధంలో కలిసిపోయేలా గట్టిగా అరుస్తాడు. ప్రస్తుతం తన పరిస్థితి కూడా అలాగే ఉందంటూ ఆ సీన్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ ఫాస్ట్ బౌలర్.. ‘ఇది అనుభూతి. నేను దానిని వివరించలేను. నేను ఈ క్షణం కోసం జీవితకాలం వేచి ఉన్నట్లు అనిపిస్తుంది. అందరికీ చాలా కృతజ్ఞతలు. నేను మళ్లీ ఉత్తమమైన ప్రదర్శనను కొనసాగించాలని ప్రార్థిస్తూనే ఉన్నా’ అంటూ రాసుకొచ్చాడు. ఇక శ్రీశాంత్ 2011లో చివరి వన్డే, 2008లో చివరి T20 ఆడాడు.
This is the feeling @jerseymovie , i just can’t explain it..feels like I’ve been waiting for this moment for a life time ..extremely grateful to all❤️❤️❤️💯💯💯🙏🏻🙏🏻🙏🏻🙏🏻pls keep praying for me to keep performing at my very best❤️❤️❤️💯💯💯🇮🇳🇮🇳🇮🇳✅🏏✌🏻✌🏻✌🏻✌🏻 pic.twitter.com/d0Ul5uMxOf
— Sreesanth (@sreesanth36) December 25, 2021
- Tags
- indian criketer