- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ టీకా 92 శాతం ఎఫెక్టివ్: రష్యా
మాస్కో: స్పుత్నిక్ వీ టీకా కరోనా వైరస్‌ను నియంత్రించడంలో 92శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నదని రష్యా ప్రకటించింది. థర్డ్ ఫేజ్ ట్రయల్స్‌లో భాగంగా రెండు డోసులు తీసుకున్న 16వేల మంది పార్టిసిపెంట్లకు సంబంధించిన ఫలితాల ఆధారంగా చేసిన విశ్లేషణలో ఈ విషయం వెల్లడైందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF) తెలిపింది.
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తున్నదని ట్రయల్స్ డేటా ఆధారంగా తెలుస్తున్నట్టు ఆర్డీఐఎఫ్ హెడ్ కిరిల్ దిమిత్రివ్ వెల్లడించారు. గమేలియా ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న ఈ టీకా దేశవ్యాప్తంగా 29 క్లినిక్స్‌లో 40వేల మంది పార్టిసిపెంట్లపై మూడో దశ ట్రయల్స్ సాగుతున్నాయి. ప్రపంచంలో తొలిసారిగా రెగ్యులేటరీ ఆమోదం పొందిన తొలి టీకా స్పుత్నిక్ వీ. మూడో దశ ట్రయల్స్ సెప్టెంబర్‌లో మొదలవ్వగా, ఈ ఆమోదం ఆగస్టులోనే రావడం గమనార్హం. ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు అభివృద్ధి చేస్తున్న టీకా 90శాతం సమర్థంగా పనిచేస్తున్నదని ఆ కంపెనీలు ప్రకటన చేసిన రెండు రోజుల వ్యవధిలో రష్యా కూడా ప్రకటించడం గమనార్హం.