Spotify Ruk Jaana Nahi : కొవిడ్19 స్టోరీలతో.. స్పాటిఫై ‘రుక్ జానా నహీ’ సిరీస్!

by Shyam |   ( Updated:2021-05-28 07:35:50.0  )
Ruk Jaana Nahi, series
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్ 19 విజృంభిస్తున్న వేళ.. వైరస్ బాధితులకు ఎంతోమంది సాయమందిస్తూ సహృదయతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంచి సమరిటన్ల(హెల్ప్‌ఫుల్ పర్సన్) కథలను హైలైట్ చేయడానికి ‘రుక్ జానా నహీ’ పేరుతో లిమిటెడ్ ఆడియో, వీడియో సిరీస్‌ను తీసుకొస్తున్నట్టు స్పాటిఫై తాజాగా ప్రకటించింది. మొత్తం 8 ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్‌ను బాలీవుడ్ యంగ్ హీరో రాజ్ కుమార్ రావు హోస్ట్ చేయనుండటం విశేషం.

స్పాటిఫై అందిస్తున్న ‘రుక్ జానా నహీ’ సిరీస్‌ను వచ్చే వారం చివరన విడుదల చేయనుండగా.. సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ ఈ రోజే(శుక్రవారం) విడుదలైంది. సిరీస్‌లోని 8 ఎపిసోడ్‌లు దేశవ్యాప్తంగా కొవిడ్ -19 మహమ్మారి సమయంలో వేర్వేరు వ్యక్తులు చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలతో కూడిన ఆడియో, వీడియోలు ఉంటాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలోనూ విధుల్లో భాగమైన వైద్యుల కథలు కూడా ఇందులో ఉంటాయని స్పాటిఫై తెలిపింది. కొవిడ్ బాధితులకు ఆహారం అందించిన వారి కథలతో పాటు మాస్క్‌, పీపీఈ కిట్‌లు పంపిణీ చేసిన వ్యక్తులు, పరిమిత వనరులతోనూ తోచిన సాయం చేసిన సహృదయుల కథలు ఈ సిరీస్‌లో ఉండనున్నాయి. రోగులను వైద్య సదుపాయాలతో అనుసంధానించడంలో సాయపడిన యువ భారతీయుల గురించి కూడా ఈ సిరీస్ మాట్లాడనుంది. ఈ మేరకు అసాధారణమైన పనులు చేసే సాధారణ ప్రజల కథలు అందరిలోనూ స్ఫూర్తి నింపుతాయని స్పాటిఫై అభిప్రాయపడింది. కాగా అదే పేరుతో పోడ్‌కాస్ట్ సిరీస్‌ను కూడా అందిస్తుండగా.. మే 21న ప్రసారం కానుంది.

Advertisement

Next Story