- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. ఫిట్‌నెస్‌తో చెక్ !
క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడం అంటే సాధారణ విషయం కాదు. కేవలం తమ ఆటను ప్రాక్టీస్ చేస్తేనే సరిపోదు. నిత్యం తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ.. మానసికంగా దృఢంగా ఉంటేనే రాణించగలరు. ముఖ్యంగా క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ వంటి ఔట్ డోర్ క్రీడలకు ఎంతో సన్నద్ధత అవసరం. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇండ్లకే పరిమితం కావడంతో వీరిపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఇంట్లో కూర్చొని వ్యాయామాలు చేయగలరు, కానీ ఆటను ప్రాక్టీస్ చేయలేరు. మ్యాచ్‌కి మ్యాచ్‌కి మధ్య ఒక రోజో.. వారమో గ్యాప్ వస్తే పర్వాలేదు. కానీ ఒకేసారి ఏకంగా 21 రోజుల పాటు ఇంటికే పరిమితం కావడమంటే.. శారీరకంగా, మానసికంగా క్రీడాకారులు కృంగిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో గడిపితే ఈ సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, ఇతర క్రీడాకారులు తరచూ తమ కుటుంబాలతో కలిసున్న వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఇది వారిని మరింత దృఢంగా మారుస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత దేశంలోని కుటుంబ వ్యవస్థే క్రీడాకారులను కాపాడుతోందని స్వయంగా వారే ఒప్పుకుంటున్నారు.
కానీ లాక్‌డౌన్ కారణంగా వీరికి ప్రాక్టీస్ చేయడం కష్టంగా మారింది. అందుకే లాక్‌డౌన్ ముగిసిన వెంటనే టోర్నీలు ప్రారంభించవద్దని.. కనీసం రెండు వారాల పాటు ప్రాక్టీస్ సమయం ఇవ్వాలని పలువురు క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, అదే సమయంలో క్రీడాకారులు హోమ్ జిమ్‌ను ఉపయోగించి ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని శిక్షకులు చెబుతున్నారు.
అయితే, సొంత జిమ్ లేని దిగువ మధ్యతరగతి, గ్రామీణ క్రీడాకారులకు మాత్రం లాక్‌డౌన్ సమయం ఆశనిపాతంలా మారింది. వారు ఇంట్లో సాధన చేయడానికి లేదా ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి స్కిప్పింగ్, పుషప్స్ వంటివి తప్ప వేరే చేయడానికి వీలు లేకుండా పోయింది. కనీసం రన్నింగ్ సాధన చేయడానికైనా బయటకు వెళ్లలేక పోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వీరి సమస్యలపై దృష్టిపెట్టి కాస్త సడలింపు ఇవ్వాలని కోరుతున్నారు.
ఇక క్రీడాకారులు కాకుండా సపోర్ట్ స్టాఫ్‌ది మరో సమస్య. క్రీడలు జరిగితేనే వీరికి వేతనాలు వస్తాయి, లేకుంటే కష్టమే. ప్రస్తుతం లాక్‌డౌన్ పరిస్థితుల్లో బీసీసీఐ వంటి క్రీడా సంస్థ తప్ప మరే ఇతర అసోసియేషన్లు జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేవు. ఇలాంటి సమయంలో అక్కడి ఉద్యోగులు, సహాయక సిబ్బంది ఆర్థిక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. వారికి ఆర్థికంగా భరోసా ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇన్ని సమస్యల నడుమ లాక్ డౌన్ అనంతరం క్రీడారంగం తిరిగి ఎలా పుంజుకుంటుందో వేచి చూడాల్సిందే.
Tags : Sports, Lock down, Corona, Fitness, sportsmen, Mental condition, Practice