యూకీ బాంబ్రీకి తొలి ఏటీపీ టూర్ టైటిల్..

by Vinod kumar |
యూకీ బాంబ్రీకి తొలి ఏటీపీ టూర్ టైటిల్..
X

మలోర్కా : భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ తన కెరీర్‌లో తొలి ఏటీపీ టూర్ టైటిల్ గెలుచుకున్నాడు. తన పార్ట్‌నర్ సౌతాఫ్రికాకు చెందిన లాయిడ్ హారిస్‌తో కలిసి స్పెయిన్‌లో జరిగిన మలోర్కా చాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. శనివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బాంబ్రీ జోడీ 6-3, 6-4 తేడాతో డచ్-ఆస్ట్రియన్ జోడీ రోబిన్ హస్సే-ఫిలిఫ్ ఓస్వాల్డ్‌‌‌ను చిత్తు చేసింది.

దాంతో యూకీ బాంబ్రీ కెరీర్‌లో తొలి ఏటీపీ టూర్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో బాంబ్రీ జోడీ ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఏపీటీ ర్యాంకింగ్స్‌లో బాంబ్రీ 75 ర్యాంక్‌లో ఉన్నాడు. ఈ విజయంతో అతను కెరీర్ బెస్ట్ 58వ ర్యాంక్‌కు దూసుకరానున్నాడు.

Advertisement

Next Story