ఆరు బంతుల్లో 4 వికెట్లు పడగొట్టిన యువ బౌలర్ హర్షిత్ రానా

by Mahesh |
ఆరు బంతుల్లో 4 వికెట్లు పడగొట్టిన యువ బౌలర్ హర్షిత్ రానా
X

దిశ, వెబ్ డెస్క్: యువ ప్లేయర్లతో కలిసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని ఆడేందుకు ఆస్ట్రేలియాకు భయలు దేరిన భారత జట్టు.. ఎవరూ ఊహించని విధంగా మొదటి మ్యాచులో భారీ విజయం సాధించారు. ఆస్ట్రేలియా(Australia) వంటి జట్టుపై 300 పైగా స్కోరులో విజయం సాధించిన భారత జట్టు.. ఈ నెల 5 నుంచి రెండో టెస్ట్ (పింగ్ బాల్ డే అండ్ నైట్)మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో యువ బౌలర్ హర్షిత్ రానా(Harshit Rana) సంచలనంగా మారాడు. వరుసగా ఆరు బంతుల్లో ఏకంగా 4 వికెట్లు తీసుకున్నాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యువ ప్లేయర్ గత ఐపీఎల్ సీజన్ లో మెరుపులు మెరిసి.. అనూహ్యంగా భారత టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేళానికి ముందు.. రిటెన్షన్ లో ఏకంగా రూ. 4 కోట్లు ఇచ్చి తమ జట్టులోనే ఉంచుకుంది. రానా గత సీజన్లో కేకేఆర్ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

Advertisement

Next Story

Most Viewed