WTC Final 2023: అజింక్య రహానే అరుదైన ఘనత.. ఏడో భారత ప్లేయర్‌గా..

by Vinod kumar |
WTC Final 2023: అజింక్య రహానే అరుదైన ఘనత.. ఏడో భారత ప్లేయర్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: టెస్టు క్రికెట్‌లో అజింక్య రహానే అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 క్యాచ్‌లు అందుకున్న ఏడో భారత ఆటగాడిగా రహానే రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో పాట్ కమిన్స్ క్యాచ్‌ పట్టిన రహానే.. ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ 209 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. ప్రపంచ క్రికెట్‌లో కూడా ఈ ఘనత సాధించిన జాబితాలో ద్రవిడే తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే (205) ఉన్నారు.

Advertisement

Next Story