WTC Final 2023: రీ ఎంట్రీతో అదరగొట్టిన అజింక్యా రహానే.. తొలి ఇండియన్ బ్యాటర్‌గా రికార్డ్..

by Vinod kumar |
WTC Final 2023: రీ ఎంట్రీతో అదరగొట్టిన అజింక్యా రహానే.. తొలి ఇండియన్ బ్యాటర్‌గా రికార్డ్..
X

దిశ, వెబ్‌డెస్క్: 512 రోజుల తర్వాత నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ద్వారా టెస్టు ఆడుతున్న అజింక్యా రహానే అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో రహానే 92 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ సాధించాడు. రహానే టెస్టు కెరీర్‌లో 26వ అర్థశతకం కావడం విశేషం. అజింక్యా రహానే టీమిండియా తరఫున డబ్ల్యూటీసీ ఫైనల్లో అర్థసెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో ఆజింక్యా ర‌హానె మరో రికార్డు అందున్నాడు.. టెస్టు క్రికెట్‌లో 5వేల ప‌రుగుల మైలురాయిని దాటాడు. టెస్టుల్లో ఈ ఫీట్ సాధించిన 13వ భార‌త ఆట‌గాడిగా ర‌హానె నిలిచాడు. ఆసీసీతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే ఒక్కడే ఒంటరిపోరాటం చేస్తూ టీమిండియాను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. 2021లో టీమిండియా కివీస్‌తో తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడినప్పటికి ఆ మ్యాచ్‌లో ఒక్క భారత్‌ బ్యాటర్‌ కూడా హాఫ్‌ సెంచరీ అందుకోలేకపోయాడు. అప్పటి మ్యాచ్‌లోనూ రహానే 49 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవడం విశేషం.

ఐసీసీలోని వివిధ ట్రోఫీలలో హాఫ్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్లు :

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ : సచిన్ టెండూల్కర్ (2000)

వరల్డ్ కప్ ఫైనల్ : వీరేంద్ర సెహ్వాగ్ (2003)

టీ20 వరల్డ్ కపన్ ఫైనల్ : గౌతం గంభీర్ (2207)

డబ్ల్యూటీసీ ఫైనల్ : అజింక్యా రహానే (2023)

Advertisement

Next Story