క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ఉచితంగా టికెట్స్..

by Vinod kumar |
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ఉచితంగా టికెట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది బీసీసీఐ. డబ్ల్యూపీఎల్ 2023లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు టిక్కెట్లు ఉచితంగా అందించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. అంటే మార్చి 8, 2023 న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ టిక్కెట్లు ఉచితంగా అందించనుంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటికే మహిళలకు టిక్కెట్లు ఉచితంగా అందిస్తున్నారు. అన్ని వయసుల మహిళలకు ఉచితంగా మ్యాచ్‌లను వీక్షించేందుకు అనుమతించారు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు పురుషులిద్దరికీ టిక్కెట్లు ఉచితంగా అందిస్తున్నారు. WPL 2023 టోర్నీలో ఆర్‌సీబీ వరుసగా రెండో భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ గురించి మాట్లాడితే.. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది.

Advertisement

Next Story