ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం

by Mahesh |
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం
X

దిశ, వెబ్ డెస్క్: భారత్‌లో ప్రారంభమైన ఐపీఎల్(IPL) ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్ తరహాలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)ను BCCI ప్రారంభించింది. ఇప్పటికే WPL రెండు సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకొగా. 2025 లో జరిగే మూడో సీజన్ కోసం రోజు బెంగుళూరులో మెగా వేలం జరగుతుంది. ఈ మెగా వేలంలో మొత్తం 120 మంది ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఈ 120 మందిలో 91 మంది భారతీయులు, 29 మంది విదేశీయులు ఉన్నారు. మొత్తం ప్లేయర్లలో ముగ్గురు అసోసియేట్ నేషన్స్‌కు చెందినవారు ఉన్నారు. భారత ఆటగాళ్ల విషయానికి వస్తే, 82 మంది అన్‌క్యాప్‌లో ఉండగా, 9 మంది క్యాప్‌లో ఉన్నారు. వేలంలో, అన్ని జట్లలో మొత్తం 19 స్లాట్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ మొత్తంలో విదేశీ ఆటగాళ్లకు ఐదు స్లాట్‌లు రిజర్వ్ చేశారు WPL మొదటి సీజన్‌లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలచుకోగా..రెండో సీజన్ టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గెలుచుకుంది. ఈ రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో నిలిచింది.

ఈ రోజు జరిగే వేలంలో ప్రసిద్ధి చెందిన ప్లేయర్లు ఉన్నారు. వారిలో డియాండ్రా డాటిన్ (వెస్టిండీస్), లిజెల్లీ (దక్షిణాఫ్రికా), హీథర్ నైట్ (ఇంగ్లండ్) తమ అత్యధిక బేస్ ధర రూ.50 లక్షలతో పేర్లను నమోదు చేసుకున్నారు. భారతదేశానికి చెందిన స్నేహ రాణా, పూనమ్ యాదవ్, సి ప్రత్యూష తమ బేస్ ధర రూ. 30 లక్షలు గా నమోదు చేసుకున్నారు. WPL 2025 వేలం కోసం నమోదు చేసుకున్న అతి పిన్న వయస్కురాలు భారతదేశానికి చెందిన అన్షు నగర్ (13), ఇరా జాదవ్ (14). మరోవైపు, హీథర్ నైట్, లారా హారిస్ 34 సంవత్సరాల వయస్సులోనే వేలం లోకి వచ్చారు. మరి ఈ రోజు జరిగే వేలంలో ఏ జట్టు ఏ ప్లేయర్‌ను దక్కించుకుంటుదో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

Advertisement

Next Story

Most Viewed