- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చలికాలంలో మీ కళ్లు జాగ్రత్త.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి..
దిశ, ఫీచర్స్: సాధారణంగా చలికాలంలో అనేక కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమయంలో మీకు కళ్లలో నొప్పి, కళ్లు ఎర్రబడడం, నీరు కారడం లేదా తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు లాంటివి కనిపిస్తాయి. అయితే చాలా మంది వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కొన్ని కంటి జబ్బుల లక్షణం కావచ్చని, వీటిని సకాలంలో గుర్తించడం, చికిత్స చేయడం ద్వారా, ఏదైనా తీవ్రమైన కంటి వ్యాధిని సులభంగా నివారించవచ్చని అంటున్నారు. మరి శీతాకాలంలో ఏ కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. వాటిని ఎలా నివారించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
1) కండ్లకలక:
ఈ సీజన్‌లో కండ్లకలక అనే కంటి వ్యాధి రావచ్చు. కండ్లకలక అనేది చలికాలంలో కూడా వచ్చే సాధారణ కంటి వ్యాధి. ఇది వాపు, కళ్లలో నీరు కారడం వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఈ వ్యాధిని సమయానికి నియంత్రించడం చాలా ముఖ్యం. లేకుంటే అది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది.
2) డ్రై ఐ సిండ్రోమ్ ప్రమాదం:
బ్లెఫారిటిస్ అనేది ఒక రకమైన కంటి వ్యాధి. దీనిలో కనురెప్పలు ఉబ్బుతాయి. చలికాలంలో ఇది చాలా సాధారణమైన సమస్య. అయితే దీనిని పరిష్కరించడం చాలా ముఖ్యం. చలికాలంలో డ్రై ఐ సిండ్రోమ్ వస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే గాలిలో తేమ లేకపోవడం వల్ల కళ్లు పొడిబారడం జరుగుతుంది. ఇది చికాకు, వాపు మరియు కళ్ల నుంచి నీరు కారడం వంటి సమస్యలను కలిగిస్తుంది. మీరు ఈ లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
* చలికాలంలో కళ్లను ఎలా చూసుకోవాలి..
1) ఈ చలికాలంలో మీ కళ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండి
2) గోరువెచ్చని నీటితో కళ్ళు శుభ్రం చేసుకోవాలి.
3) కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కంటి వ్యాధులను గుర్తించవచ్చు.
4) అలాగే డాక్టర్ సలహా మేరకు కంటి చుక్కలు వేసుకోవాలి
(నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.)