Power of Greenery: ప్రకృతిలో గడిపితే బోలెడు లాభాలు.. ముఖ్యంగా పిల్లల్లో..!

by Anjali |
Power of Greenery: ప్రకృతిలో గడిపితే బోలెడు లాభాలు.. ముఖ్యంగా పిల్లల్లో..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకృతి(nature)లో గడపడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. స్వచ్ఛమైనమైన గాలి దొరుకుతుంది. అలాగే మానసిక ఆనందంతో పాటు చల్లదనం.. ప్రశాంతంగా ఉంటుంది. గ్రీనరీకి దగ్గరగా నివసించే పెద్దల్లో బోన్స్(Bones) కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయని రీసెంట్ స్టడీలో వెల్లడైంది. ముఖ్యంగా పిల్లల్ని ఉద్యానవనా(garden)ల్లో ఆడిపించండని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి చోట నివసించిన పిల్లల్లో ఎదుగుదల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.

అలాగే రోగనిరోధక శక్తి(Immunity) కూడా పెరిగి పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు. చిన్న వయసులో మానసికంగా(Mental), శారీరకం(physical)గా స్ట్రాంగ్‌గా ఉండడం చాలా ముఖ్యం. ప్యూచర్‌లో మొత్తం బాడీకి ఎముకలే బలమైన పునాదిగా నిలుస్తాయి. జీవ కణజాలానికి మూలాధారంగా ఉంటుంది. కాగా పిల్లలకు నాణ్యమైన ఫుడ్‌తో పాటు ప్రతిరోజూ వ్యాయామం(exercise), శారీరక శ్రమ, పచ్చని ప్రదేశా(Green spaces)ల్లో గడపడం కూడా ముఖ్యమే.

ప్రకృతికి దగ్గరగా నివసించే పిల్లలు.. మిగతావారితో పోల్చితే ఎక్కువ చురుకుదనం చూపిస్తారు. దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉన్న వృక్షసంపద కలిగిన పట్టణ, సబర్బన్ గ్రామీణ పచ్చని ప్రదేశాలు స్థానిక పిల్లల ఎముకల సాంద్రతను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి 4 నుంచి 6 సంవత్సరాల వయసు గల 327 మంది పిల్లలను బెల్జియం(Belgium)లోని హాసెల్ట్ యూనివర్సిటీ(Hasselt University)కి చెందిన పరిశోధకులు ఎనలైజ్ చేశారు. దీంతో పచ్చని ప్రదేశాలకు దగ్గరగా జీవించే పిల్లలు, వారి తల్లులు హెల్తీగా ఉన్నట్లు వెల్లడించారు.

అధిక ఎముక ఖనిజసాంద్రతను కలిగి ఉన్నారని పరిశోధకులు నిర్దారించారు. పచ్చటి ప్రదేశానికి అత్యంత సమీపంలో 10 నిమిషాల నడక దూరంలో నివసిస్తున్న పిల్లల్లోతో పోలిస్తే 20 నిమిషాల నడక దూరంలో ఉన్న పిల్లలో ఎముక సాంద్రత(Children bone density) 61శాతం తక్కువగా ఉండే చాన్స్ ఉన్నట్లు తెలిపారు. అయితే గ్రీనరీకి దగ్గరగా ఉండే అమ్మాయిలు, అబ్బాయిల్లో వారి ఎదుగుదలకు అలాగే ఎముకల సాంద్రతను పెంచే పాల వినియోగం, విటమిన్ స్లిమింటేషన్(Vitamin Slimmentation) అన్నీ కూడా సమానంగా ఉంటున్నాయి. దీంతో హెల్తీగా ఉంటున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story

Most Viewed