ఇంట్లో ఆ బాధ్యత తల్లులదే.. కుటుంబ రక్షణపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు

by srinivas |
ఇంట్లో ఆ బాధ్యత తల్లులదే.. కుటుంబ రక్షణపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి ఇంట్లో తల్లి పోలీస్‌గా మారి కుటుంబాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు(Palakollu)లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ ఆడపిల్లలకు చెప్పే జాగ్రత్తలు.. ఇళ్లలో మగపిల్లలకు కూడా చెప్పాలని, అప్పుడే మహిళలపై ఆగడాలు, అరాచకాలు తగ్గిపోతాయని చెప్పారు. గంజాయి, మాదకద్రవ్యాలు(Marijuana, Drugs)తీసుకోవడం హీరోయిజం కాదని, ఆడపిల్లలను రక్షించిన వాళ్లే అసలైన హీరోలని అనిత పేర్కొన్నారు. పాదయాత్రలో గంజాయి బాధితుల గోడు విన్నప్పుడే నారా లోకేష్(Nara Lokesh) ఉక్కుపాదం మోపాలన్న నిర్ణయం తీసుకున్నారని అనిత వ్యాఖ్యానించారు. గంజాయి, మాదకద్రవ్యాల నివారణకు డేగకన్ను కోసం వేసేందుకే 'ఈగల్' తెచ్చామన్నారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా దాని వెనుక గంజాయి ఉంటోందని చెప్పారు. యువత కూడా ఆడపిల్లల్లో తల్లిని, చెల్లిని చూడాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు.

Advertisement

Next Story