Alcohol: లిమిట్‌లో తీసుకున్నా వాంతులు అవుతున్నాయా..?

by Anjali |   ( Updated:2024-12-15 10:49:20.0  )
Alcohol: లిమిట్‌లో తీసుకున్నా వాంతులు అవుతున్నాయా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కొంతమంది యువత మద్యానికి ఎక్కువగా బానిసవుతున్నారు. వీకెండ్స్ అంటూ.. ఫ్రెండ్స్ కలిస్తే.. బాధొచ్చినా, సంతోషమోచ్చినా.. మందు తాగుతుంటారు. అయితే కొంతమంది ఫుల్‌గా తాగినాక వాంతులు చేసుకుంటారు. కానీ మరికొంతమందికి కొంచెం తాగగానే వాంతింగ్స్(vomiting) అవుతాయి. కాగా దీని వెనక చాలానే కారణాలున్నాయంటున్నారు నిపుణులు. మనుషుల శరీర తత్వం అందరీది ఒకేలా ఉండదు కాబట్టి తమ బాడీని బట్టి రీజన్స్ కూడా వేరు వేరుగా ఉంటాయి.

మందు తాగితే తట్టుకునే శక్తి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కాగా ప్రతీసారి ఆల్కహాల్(Alcohol) తాగినప్పుడు వాంతులు అయితే.. తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలంటున్నారు నిపుణులు. అలాగే మద్యం కూడా లిమిట్‌లో తీసుకుంటే మేలు. అయితే తాగినప్పుడు టాయిలెట్ అధిక స్థాయిలో ప్రొడ్యూస్ అవుతుంటుంది. దీంతో బాడీ డీహైడ్రేషన్(Body dehydration) అవ్వడానికి కూడా కారణమవుతుంది.

మద్యం అతిగా తాగినట్లైతే.. అది పాయిజనింగ్‌(Poisoning)గా కన్వర్ట్ అయి.. వాంతుల రూపంలో బయటకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొంతమంది మద్యం చాలా ఫాప్ట్ ఫాస్ట్‌గా తాగుతుంటారు. దీంతో తక్కువ తక్కువ సమయంలోనే ఎక్కువ ఆల్కహాలు బాడీలోపలికి వెళ్లడంతో.. పాయిజనింగ్‌గా కన్వర్ట్ అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ బ్రాండ్ల ఆల్కహాల్ తాగితే.. వెంటనే ప్రయాణం మంచిది కాదు. దీంతో జీర్ణాశయ గోడలు దెబ్బతింటాయి. ఈ కారణంగా కూడా వాంతులు అవుతుంటాయి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story