రోడ్డు దాటుతుండగా ప్రమాదం...

by Sridhar Babu |
రోడ్డు దాటుతుండగా ప్రమాదం...
X

దిశ, గన్నేరువరం : మండలంలోని రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజీ వద్ద ప్రధాన రహదారిని దాటుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని హైదరాబాద్​ నుండి కరీంనగర్ వెళ్తున్న టాటా సుమో వాహనం ఢీకొట్టింది. దాంతో తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం అతనిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మృతుని ఊరు, పేరు తెలియదని, సుమారు 30 సంవత్సరాల వయసు కలిగి ఉంటాడని ఎస్సై తాండ్ర నరేష్ తెలిపారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story