- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరీక్షలు రాసే అభ్యర్థులకు ఆటంకం కలగకూడదు
by Naveena |
X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: గ్రూప్ -2 పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు పటిష్టంగా నిర్వహిస్తూ,పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని జోగులాంబ జోన్ -7 డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఆదేశించారు. ఆదివారం ఆయన జిల్లా ఎస్పీ జానకి తో కలిసి గ్రూప్ -2 పరీక్ష కేంద్రమైన జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల వద్ద బందోబస్తు,పరీక్షల నిర్వాహణా పరిస్థితులను పర్యవేక్షించారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని,పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు అనుసరించాల్సిన విధానంపై తగు సూచనలు చేశారు. అంతలోనే పరీక్ష రాయడానికి గర్భిణీతో ఒక మహిళ గేటు దగ్గరకు రాగా, గేటు నుంచి పరిక్ష రాసే హాలు చాలా దూరం ఉన్నందున డిజీపీ,ఎస్పీ లు మానవతా దృక్పథంతో స్పందించి..ఆమెను పరీక్ష హాలు వరకు కారులో దింపాలని పోలీసులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ గాంధీ నాయక్,ఎస్ఐ లు ఉన్నారు.
Advertisement
Next Story