Lavanya Tripathi: పెళ్లైన ఏడాదికి బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించిన మెగా కోడలు .. ఎక్జైటింగ్‌గా ఉన్నానంటూ ట్వీట్

by Hamsa |
Lavanya Tripathi: పెళ్లైన ఏడాదికి బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించిన మెగా కోడలు .. ఎక్జైటింగ్‌గా ఉన్నానంటూ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi), మెగా హీరో వరుణ్ తేజ్‌(Varun Tej)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఆమె సినిమాలకు దూరం అయింది. ఇటీవల ‘మిస్ ఫర్‌ఫెక్ట్’(Miss Perfect) వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత పూర్తిగా పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టి వెకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేసింది. పెళ్లి తర్వాత దాదాపు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన ఆమె మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తోంది.

నేడు లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా(Social Media) ద్వారా బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించింది. ‘సతీ లీలావతి’(Sathi Leelavathi ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘‘ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఎక్జైటింగ్‌గా ఉన్నాను. ఇది అద్భుతమైన కథ. ఈ టీమ్ నా దృష్టిని ఆకర్షించింది. వచ్చే ఏడాది దీన్ని ప్రారంభించడం పట్ల నేను థ్రిల్‌గా ఉన్నాను.

సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఇదొక అద్భుతమైన మార్గం’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ వీడియోను కూడా షేర్ చేసింది. అయితే ఇందులో లావణ్య ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని దుర్గాదేవి పిక్చర్స్(Durgadevi Pictures), ట్రియో స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగమోహన్ బాబు(Nagamohan Babu), ఎమ్ రాజేష్, నిర్మించనున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం లావణ్య పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా వావ్ సూపర్ అంటున్నారు.

Advertisement

Next Story