వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నందమూరి లక్ష్మీ పార్వతి నియామకం

by Mahesh |
వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నందమూరి లక్ష్మీ పార్వతి నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ(YCP) పార్టీ కొద్ది రోజులు సైలెంట్ అయింది. ఆరు నెలలు గడిచిన తర్వాత రంగంలోకి దిగిన కీలక నేతలు కూటమి ప్రభుత్వం పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులను ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్, పార్టీ కీలక నేతలు బహిరంగ సభల్లో పాల్గొంటూ.. 2027 లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి, వైసీపీ(YCP) శ్రేణులు అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ బిల్లు పార్లమెంట్ లో త్వరలో చర్చకు రానుంది. ఒక వేల బిల్ పాస్ అయితే 2027 లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికలే టార్గెట్ గా చేసుకుని వైసీపీ పార్టీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో జిల్లాలకు ఇంజార్జులను ప్రకటించి కార్యచరణ సిద్దం చేస్తుంది. దీంట్లో భాగంగా వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) ఆదేశాల మేరకు.. నందమూరి లక్ష్మీ పార్వతి(Nandamuri Lakshmi Parvati)ని పార్టీ ప్రధాన కార్యదర్శి(Secretary)గా నియమిస్తూ.. ఆ పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Next Story