పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

by Kalyani |
పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
X

దిశ, సికింద్రాబాద్: నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి , త్వరగా పూర్తి చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అధికారులకు సూచించారు. సీతాఫలమండి డివిజన్ పరిధిలోని కుట్టివెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన సంబంధిత అధికారులు, కార్పోరేటర్ల తో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీతాఫలమండితో పాటు సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం గా నిలిచిన ప్రాజెక్టులు తమ హయంలోనే ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణానికి రూ.12 కోట్ల మేరకు నిధులను గతంలోనే మంజూరు చేయించామని చెప్పారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. కుట్టి వెల్లోడి ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దాలన్నారు. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఈ ప్రాంగణం నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత, లింగాని ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story