అదే టీమిండియా‌కు ప్రధాన సమస్య: పాక్ మాజీ ప్లేయర్

by Hajipasha |   ( Updated:2022-10-13 06:38:30.0  )
అదే టీమిండియా‌కు ప్రధాన సమస్య: పాక్ మాజీ ప్లేయర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాపై పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందే గాయాల కారణంగా టీమిండియా కీలక ప్లేయర్లు జట్టుకు దూరం అయ్యారు. దీనిపై స్పందించిన మాజీ పేసర్ వసీం అక్రమ్.. టీమిండియా బ్యాటింగ్ లైన్‌అప్ అద్భుతంగా ఉంది. కానీ, బౌలింగ్‌లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఎందుకుంటే ఈ టోర్నీ ప్రారంభానికి ముందే జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ ప్లేయర్లు దూరం కావడం భారత్‌కు అతి పెద్ద సవాల్ అని అన్నాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ ఆస్ట్రేలియాలో బౌలింగ్ చేయడం కష్టమేనని, అతని బౌలింగ్‌లో స్వింగ్‌ లేకపోతే ప్రత్యర్థిని ఎదుర్కోవడం ఇబ్బందేనని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో పేస్ బౌలర్లు టీమిండియాకు అవసరమని వసీం అక్రమ్ అన్నాడు.

ఇవి కూడా చదవండి :

T20I ర్యాంకింగ్స్.. టాప్ 5 బ్యాటర్స్..?

Advertisement

Next Story