WI VS IND 2nd Test: టీమిండియా యంగ్‌ ప్లేయర్లను కలిసిన మిస్‌ వరల్డ్‌..

by Vinod kumar |
WI VS IND 2nd Test: టీమిండియా యంగ్‌ ప్లేయర్లను కలిసిన మిస్‌ వరల్డ్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు మిస్‌ వరల్డ్‌ ఆఫ్ ట్రినిడాడ్ అండ్‌ టొబాగో ఆచె ఆబ్రహామ్స్ టీమిండియా యంగ్‌ స్టార్‌ ప్లేయర్స్‌ శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌లను కలిసింది. ఈ సందర్భంగా ఆమె వారితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనబర్చింది. ఫోటోలను తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌కు స్టేటస్‌గా పెట్టుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే ఫోటోలు దర్శనమిస్తున్నాయి. మిస్‌ వరల్డ్‌ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆచె ఆబ్రహామ్స్.. వెస్టిండియన్ లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారా ఆహ్వానం మేరకు భారత్‌-విండీస్‌ మ్యాచ్‌ చూసేందుకు క్వీన్స్ పార్క్ ఓవల్‌ మైదానానికి వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed