- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీమిండియా నెక్ట్స్ టెస్ట్ కెప్టెన్ ఎవరు..? వారిద్దరి మధ్య తీవ్ర పోటీ..
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బాయ్ చెప్పిన విషయం తెలిసిందే. కోహ్లీ షాకింగ్ నిర్ణయంతో క్రీడాప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురి అయింది. కోహ్లీ ఇంత సడెన్‌గా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియదు. 7 సంవత్సరాల పాటు కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. ఎంతో మంది కెప్టెన్‌ల కూడా సాధ్యం కాని రికార్డ్‌లు సాధించాడు. టీమిండియాను నెం.1 పొజిషన్‌లో నిలబెట్టాడు. అలాంటిది కేవలం మూడు నెలల్లోనే 3 ఫార్మట్ల కెప్టెన్సీకి గుడ్ బాయ్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీనితో టీమిండియాకు తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరన్న చర్చ నడుస్తుంది. ఈ రేస్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ముందు వరుసలో ఉన్నారు.
వీరిలో రోహిత్ శర్మ లేదా కేఎల్ రాహుల్ వైపే బీసీసీఐ ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ, రోహిత్ శర్మకు ఒక సమస్య వచ్చింది. అదేంటంటే రోహిత్ శర్మ వయస్సు ప్రస్తుతం 34సంవత్సరాలు. ఈ వయస్సులో అతడు ఎక్కువ కాలం టెస్ట్‌లలో కొనసాగే అవకాశం చాలా తక్కువ. అంతే కాకుండా రోహిత్ శర్మకు టెస్ట్‌లలో రికార్డ్ కూడా అంత గొప్పగా ఏమిలేదు. దీనితో అతన్ని పక్కన పెట్టే చాన్స్ ఉంది. బీసీసీఐ కనుక 3 ఫార్మట్లకు ఒకే కెప్టెన్ ఉండాలనుకుంటే రోహిత్ టెస్ట్ కెప్టెన్ కావడం ఇక లాంఛనమే. ఇక రోహిత్ కాదనుకుంటే తర్వాత కెప్టెన్ అయ్యే చాన్స్ ఎక్కువగా కేఎల్ రాహుల్‌కే ఉంది. రాహుల్ వెరీ టాలెంటెడ్ బ్యాట్స్‌మెన్. పరిస్థితులకు తగ్గట్లు ఆడటంలో రాహుల్ దిట్ట. అంతే కాకుండా ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా చేసిన అనుభవం ఉంది. కావున బీసీసీఐ రాహుల్ వైపే మొగ్గు చూపే చాన్స్ ఎక్కువగా ఉంది. వీటితో పాటుగా రాహుల్‌కు ఏజ్ కూడా కలిసిరానుంది. అతడి వయస్సు ప్రస్తుతం 29సంవత్సరాలు. దీనితో అతడి ఇంకా చాలా ఎక్కువ కాలం క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ఇక వీరి తర్వాత యంగ్ అండ్ డైనమిక్ బ్యాట్స్ మెన్, బెస్ట్ కీపర్ రిషబ్ పంత్. పంత్‌కు ఐపీఎల్‌లో ఢిల్లీకి కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. దానితో పాటుగా సీనియర్స్, జూనియర్స్‌ను కలుపుకుపోవడంలో పంత్ దిట్ట. అందరితో చాలా సరదాగా ఉంటాడు. మరీ బీసీసీఐ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.