జింబాబ్వే టూరులో భారత కోచ్‌గా లక్ష్మణ్?.. గంభీర్‌ నో చెప్పాడా?

by Harish |
జింబాబ్వే టూరులో భారత కోచ్‌గా లక్ష్మణ్?.. గంభీర్‌ నో చెప్పాడా?
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు టీ20 సిరీస్‌ కోసం జింబాబ్వేలో పర్యటించనుంది. జూలై 6 నుంచి 14 వరకు ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ టూరుకు ఈ వారంలో బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఎన్‌సీఏ కోచ్‌లతో కలిసి లక్ష్మణ్ జింబాబ్వేకు వెళ్లనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

‘లక్ష్మణ్‌తోసహా కొంతమంది ఎన్‌సీఏ కోచ్‌లు యువ జట్టుతో కలిసి జింబాబ్వేకు వెళ్లే అవకాశం ఉంది. ద్రవిడ్ అతని బృందం విశ్రాంతి తీసుకున్నప్పుడు లక్ష్మణ్, ఎన్‌సీఏ కోచ్‌లు వారి స్థానాలను భర్తీ చేశారు.’అని పేర్కొన్నాయి. టీ20 వరల్డ్ కప్‌తో భారత ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం హెడ్ కోచ్ రేసులో గంభీర్, డబ్ల్యూవీ రామన్ ఉన్నారు. గంభీర్ నియామకం లాంఛనమే అని వార్తలు వస్తున్నాయి. అయితే, గంభీర్ బాధ్యతలు చేపట్టడానికి సమయం అడిగినట్టు తెలుస్తోంది. దీంతో జింబాబ్వే టూరుకు భారత జట్టుతో లక్ష్మణ్ పంపించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వారంలో భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

Next Story