- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విరాట్ ఔట్ అయిన క్షణాన్ని మర్చిపోలేను- సౌరభ్ నేత్రవల్కర్
దిశ, స్పోర్ట్స్ : అమెరికాలో ప్రస్తుతం సౌరభ్ నేత్రవల్కర్ పేరు మారుమోగుతోంది.గ్రూప్ -ఏలో భారత్‌తో తలపడిన అమెరికా జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆ మ్యాచులో తొలి బంతికే విరాట్ కోహ్లీని ఔట్ చేసిన సౌరభ్ నేత్రవల్కర్ ఉన్నట్టుండి ఫేమస్ అయిపోయాడు. గతంలో భారత్ తరఫున అండర్-19 ఆడిన పేసర్ సౌరభ్.. తాజాగా టీ20 వరల్డ్ కప్‌లో అదరగొడుతున్నాడు. భారత్ చేతిలో ఓడిపోవడం కంటే ముందు అమెరికా జట్టు పాకిస్తాన్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. ఆ మ్యాచులోనూ సౌరభ్ కీలకంగా వ్యవహరించాడు.
ఇక, విరాట్‌తో పాటు రోహిత్‌శర్మను కూడా సౌరభ్ ఔట్ చేయగా.. శుక్రవారం అమెరికా చివరగా ఐర్లాండ్‌తో తలపడనుంది. మ్యాచ్‌కు ముందు మీడియాతో సౌరభ్ మాట్లాడుతూ.. ‘ఇద్దరు స్టార్లను ఔట్ చేయడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. నా హ్యపీనెస్‌ను మాటల్లో చెప్పలేను. అమెరికా గత రెండు మ్యాచుల్లో రెండు టాప్ జట్లతో తలపడింది. ఇక విరాట్ కోహ్లీని తొలి బంతికే ఔట్ చేయడం నాకు ఒక భావోద్వేగ క్షణం. ఆఫ్ స్టంప్‌కు అవతల బంతిని విసిరి ఫలితాన్ని రాబట్టాలని అనుకున్నా.. అందుకు తగ్గట్టుగానే వికెట్ దక్కడం ఆనందంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ నాకు అండర్-15 నుంచి తెలుసు. మేమిద్దరం కలిసే ఆడాం. విరాట్ నాకు వ్యక్తిగతంగా తెలియదు. కానీ, మ్యాచ్ అనంతరం నన్ను అభినందించాడు’ అని పేర్కొన్నాడు.