Virat Kohli: 'బ్యాట్‌పై లోగోకే కోహ్లీ రూ. 100 కోట్లు?'.. మరి రోహిత్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా!

by Vinod kumar |
Virat Kohli: బ్యాట్‌పై లోగోకే కోహ్లీ రూ. 100 కోట్లు?.. మరి రోహిత్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా!
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ.. ఆదాయ ఆర్జనలోనూ అందరికంటే టాప్‌ గేర్‌లో దూసుకెళుతున్నాడు. కోహ్లీతో ఎమ్ఆర్‌ఎఫ్ కంపెనీ పదేళ్ల కాలానికి అతడితో రూ. 100 కోట్ల కాంట్రాక్ట్‌ను కుదుర్చుకుంది. అంటే ఏడాదికి రూ. 12.50 కోట్లు చెల్లిస్తోంది. ఈ కాంట్రాక్ట్​ ప్రకారం.. విరాట్ బ్యాట్‌పై ఎమ్ఆర్‌ఎఫ్ లోగో ఉంటుంది. అయితే ప్రపంచ క్రికెటర్లలో విరాట్‌దే ఖరీదైన కాంట్రాక్ట్. మరి విరాట్ తర్వాత స్థానంలో ఉన్న వారెవరో చూద్దాం. ఈ జాబితాలో ఏయే కంపెనీలు.. ఏడాదికి ఎవరెవరికి ఎంత మొత్తం చెల్లిస్తున్నాయో తెలుసుకుందాం.


ఈ జాబితాలో టీమ్ ఇండియా కెప్టెన్ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మకు సియెట్ టైర్స్ ఏడాదికి రూ. 4 కోట్లు చెల్లిస్తోంది. మూడో ప్లేస్‌లో డేవిడ్ వార్నర్ డీఎస్‌సీ రూ. 3.3 కోట్లు చెల్లిస్తోంది. నాలుగో స్థానంతో ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (న్యూ బ్యాలెన్స్ డీసీ వెర్షన్ రూ. 2.45 కోట్లు) ఉండగా.. ఐదో స్థానంలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ (స్పార్టన్ కంపెనీ రూ. 2.2 కోట్లు) చెల్లిస్తోంది. టీమ్ ఇండియా యువ బ్యాటర్ రిషబ్ పంత్‌కు ఎస్‌జీ కంపెనీ రూ. 2 కోట్లు చెల్లిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed