ఒలంపిక్స్ లో రెజ్లర్ వినేష్ ఫోగట్ రికార్డ్

by M.Rajitha |
ఒలంపిక్స్ లో రెజ్లర్ వినేష్ ఫోగట్ రికార్డ్
X

దిశ, వెబ్ డెస్క్ : పారిస్ ఒలంపిక్స్ లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ క్వార్టర్స్ కు చేరింది. 50 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్ లో గెలిచి భారత్ కు మరో పతకాన్ని దాదాపు ఖాయం చేసింది. కాగా ఈ ప్రిక్వార్టర్స్ లో ప్రపంచ నెం.1 రెజ్లర్ అయిన జపాన్ కు చెందిన సుసాకి మీద గెలిచి రికార్డ్ సృష్టించింది. వినేష్ ఆరంభంలో వెనుకబడినప్పటికీ తర్వాత పుంజుకొని 3-2తో అద్భుత విజయాన్ని అందుకుంది. 2016 రియో ఒలంపిక్స్ లో మోకాలికి తీవ్ర గాయమవడంతో వినేష్ అర్థాంతరంగా పోటీ నుండి విరమించాల్సి వచ్చింది. టోక్యోలో క్వార్టర్స్ లో ఓడిపోయిన వినేష్ కి బహుశా ఇదే చివరి ఒలంపిక్స్ అవుతుందని అంచనా. కాగా మంగళవారమే క్వార్టర్స్, సెమీ ఫినల్స్ కూడా జరగనున్నాయి.

Next Story

Most Viewed