- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాడ్రిడ్ ఓపెన్: స్టార్ ప్లేయర్లు ఔట్.. బోపన్న జోడీ సైతం
దిశ, స్పోర్ట్స్: మాడ్రిడ్ ఓపెన్‌లో స్పెయిన్ దిగ్గజం, 22 గ్రాండ్ స్లామ్‌ల విజేత రఫెల్ నాదల్‌కు చెక్ రిపబ్లిక్ ఆటగాడు, 31వ సీడ్ జిరి లెహెకా షాక్ ఇచ్చాడు. పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్లో వీరు పోటీ పడగా, 5-7, 4-6 తేడాతో రఫెల్ ఓటమిపాలయ్యాడు. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. రికార్డు స్థాయిలో ఐదుసార్లు ‘మాడ్రిడ్ ఓపెన్’ టైటిళ్లు గెలుచుకున్న నాదల్.. తన కెరీర్‌లో ఇదే చివరి మాడ్రిడ్ ఓపెన్ టోర్నీగా భావిస్తున్నాడు. 37ఏళ్ల వయసున్న నాదల్.. త్వరలోనే ఆటకు వీడ్కోలు పలికే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇక, ఇదే టోర్నీలో రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్‌కు సైతం షాక్ తగిలింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో రష్యా ప్లేయర్, 8వ ర్యాంకు ఆటగాడైన ఆండ్రీ రుబ్లేవ్ చేతిలో 6-4, 3-6, 2-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. దీంతో సొంతగడ్డపై టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఈ స్పెయిన్ స్టార్.. క్వార్టర్స్ దశలోనే వెనుదిరగడం గమనార్హం. మరోవైపు, టాప్ సీడెడ్ ఇండో-ఆస్ట్రేలియన్ జోడీ రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్‌లు సైతం తీవ్ర నిరాశపరిచారు. మెన్స్ డబుల్స్ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై, టోర్నీ నుంచి వెనుదిరిగారు.