- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్లు వీళ్లే!
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ముగిసిన న్యూజిలాండ్, టీమిండియా టీ20 సిరీస్ 2-1 ను తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఇక, ఆ మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన శుభ్‌మన్ గిల్ టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన.. 7వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. టీమిండియా ప్లేయర్లలో సురేశ్ రైనా, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ తర్వాత శుభ్‌మన్ గిల్ నిలిచాడు. అంతేకాక టీమిండియా తరుపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ప్లేయర్‌గా కూడా నిలిచాడు. కాగా, టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో గిల్ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో విరాట్ కోహ్లీ, తర్వాత రోహిత్ శర్మలు ఉన్నారు.
శుభ్‌మన్ గిల్..
న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 126 పరుగులు చేశాడు. టీమిండియా ప్లేయర్లలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన వారి జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.
విరాట్ కోహ్లీ..
అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో కోహ్లీ 66 బంతుల్లో 122 పరుగులు చేశాడు. 71వ టీ20 అంతర్జాతీయ సెంచరీగా కగా.. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
రోహిత్ శర్మ
2017లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ 118 వ్యక్తిగత స్కోర్ చేసి మూడో స్థానంలో నిలిచాడు. 49 బంతుల్లో 10 సిక్సులు, 12 ఫోర్లతో ఈ పరుగులు చేసి ప్రస్తుతం ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.