పారిస్ ఒలింపిక్స్‌‌కు భారత మెన్స్ హకీ జట్టు

by Hajipasha |
పారిస్ ఒలింపిక్స్‌‌కు భారత మెన్స్ హకీ జట్టు
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నిర్వహించే ఒలింపిక్స్ కోసం భారత పురుషుల హకీ జట్టును మేనేజ్మెంట్ ప్రకటించింది. మొత్తం 16 మంది ఆటగాళ్లను పారిస్ ఒలింపిక్స్ కోసం ఎంపిక చేసినట్లు హకీ ఇండియా మేనేజ్మెంట్ పేర్కొంది. జట్టులో కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్, గోల్ కీపర్‌గా శ్రీజేశ్ వ్యవహరించనున్నారు. డిఫెన్స్ విభాగంలో హర్మన్ ప్రీత్, జర్మన్ ప్రీత్, అమిత్, సుమిత్, సంజయ్, మిడ్ ఫీల్డర్లుగా రాజ్ కుమార్, షంషేర్, మన్ ప్రీత్, హార్దిక్, వివేక్ సాగర్, ఫార్వర్డ్‌లో అభిషేక్, సుఖ్ జీత్, లలిత్, మన్ దీప్, గుర్జంత్ ఉన్నారు. కాగా,2024 జూలై 16న ప్రారంభంకానున్న పారిస్ ఒలింపిక్స్ ఆగస్టు 11తో ముగియనున్నాయి.

Next Story

Most Viewed