అందమే అసూయ పడేలా.. యంగ్ హీరోయిన్ సొగసుకు ఫ్యాన్స్ ఫిదా

by sudharani |
అందమే అసూయ పడేలా.. యంగ్ హీరోయిన్ సొగసుకు ఫ్యాన్స్ ఫిదా
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ ‘లవ్ ఫెయిల్యూర్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘ఖిలాడీ, స్పై’ వంటి సినిమాల్లో నటించి తన అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను గెలుచుకుంది. కానీ, నటిగా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అయితే.. తాజాగా ‘భజే వాయు వేగం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అమ్మడు నటనతో ప్రశంసలు అందుకుంది.

ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ ఐశ్వర్య. ఎప్పుటికప్పుడు క్రేజీ ఫొటో షూట్స్ చేస్తూ.. అందాలతో అదరహా అనిపించుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్కై బ్లూ కలర్ ఆఫ్ శారీలో దర్శనమిచ్చిన ఐశ్వర్య మీనన్ గ్లామర్‌కు ఫ్యా్న్స్ ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా.. బ్యూటీఫుల్, అందమే అసూయ పడేలా ఉన్నావు అని కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed