పెనుమాక పింఛన్‌దారులకు గుడ్ న్యూస్.. ఓ ఇంటికి వెళ్లి పెన్షన్ అందివ్వనున్న సీఎం చంద్రబాబు

by srinivas |
పెనుమాక పింఛన్‌దారులకు గుడ్ న్యూస్.. ఓ ఇంటికి వెళ్లి పెన్షన్ అందివ్వనున్న సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల వద్దకే పాలన అందిస్తున్నారు. సీఎంగా ఉన్నప్పటికి ఇప్పటికే ప్రతి శనివారం ఆయన ప్రజా వినతలు స్వీకరిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల హామీలు ఒక్కొక్కటికి నెరవేర్చుతున్నారు. అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు. చంద్రబాబు చెప్పినట్లుగానే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చిన హామీపై ఫుల్లుగా ఫోకస్ పెట్టారు. జులై నెల వస్తుండటంతో 1వ తారీఖునే పింఛన్‌దారులకు నగదు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. మరో రోజులో లబ్ధిదారులకు రూ. 7 వేలు అందించనున్నారు.

తాము అధికారంలో వస్తే 4 వేలు పెన్షన్ ఇస్తామని చెప్పినట్లుగా ఏప్రిల్, మే నెలకు సంబంధించిన రూ.1000 చొప్పున జులై నెలతో కలిపి మొత్తం రూ.7 వేలు అందించేందుకు అటు ప్రభుత్వం, ఇటు అధికారులు సిద్ధమయ్యారు. అయితే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ ఇంటికి వెళ్లి స్వయంగా సీఎం చంద్రబాబునే పింఛన్ డబ్బులు అందించనున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. తమ నాయకుడు ప్రజల మనిషి అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed