- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్ న్యూస్ చెప్పబోతున్న మిల్కీ బ్యూటీ.. అసలు ఊహించలేదంటూ ఫ్యాన్స్ ఖుషీ!
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ మిల్కీ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి కొన్నేళ్లు అవుతున్నా అమ్మడు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస సినిమాలు చేస్తూ తమన్న ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌తో బోల్డ్ సీన్స్ చేసి రెచ్చిపోయిన బ్యూటీ అందరిని షాక్‌కు గురి చేసింది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇటీవల తమన్నా భాటియా అరుణ్మై-4 సిరీస్‌తో అలరించింది. ప్రస్తుతం ఓదెల-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తమన్న పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వీరిద్దరు అధికారికంగా ప్రకటిస్తూ పలు ఇంటర్వ్యూస్‌లో చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్లు పెళ్లి ఎప్పుడు అని పలుసార్లు ప్రశ్నించినప్పటికీ ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు.
కానీ ఈ వీరిద్దరు షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా వెకేషన్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఈ క్రమంలో.. పెద్దలు పెళ్లి చేసుకోమని వీరిని బలవంతం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే వీరిద్దరు రిలేషన్ గురించి ప్రకటించి కూడా ఏడాది పూర్తి కావడంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి ఎక్కువైందట. దీంతో తమన్న-విజయ్‌లు ఒప్పుకున్నట్లు సమాచారం. పెళ్లికి ముహూర్తం పెట్టే పనిలో ఉన్నారని టాక్. తొందరలోనే పెళ్లి గురించి ప్రకటించనున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మిల్కీ బ్యూటీ కూడా తొందరలో ఓ ఇంటికి కోడలు కాబోతుందని అంటున్నారు.